![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 ఎవరి ఊహలకి అందకుండా రోజుకో ట్విస్ట్ తో దూసుకెళ్తుంది. గతవారం జరిగిన ఓ టాస్క్ లో ఆపిల్ చెట్టుకి ఉన్న ఆపిల్ తీసుకున్న కంటెస్టెంట్స్ కి మూడు రకాల గింజలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే నీలం గింజ కలిగిన వారికి ఫ్యామిలీ నుండి గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఇక నలుపు గింజ కలిగిన వాళ్ళకి ఇమ్మ్యూనిటి టాస్క్ పెట్టాడు.
ఇక చివరగా రెడ్ గింజ కలిగిన వాళ్ళు హౌస్ లోఎవరినైనా ఎలిమినేట్ చెయ్యొచ్చు. ఆ రకంగా రెడ్ గింజ కలిగిన కంటెస్టెంట్స్ అందరు కూడా డిసైడ్ అయ్యి సంజనని సెలక్ట్ చేస్తారు. " సంజన మీరు ఎలిమినేట్ అయ్యారు.. మీ లాగేజ్ తీసుకొని మెయిన్ గేట్ నుండి వెళ్ళండి" అని బిగ్ బాస్ చెప్తాడు. ఇక సంజన చేసేదేమీ లేక నన్ను కార్నర్ చేశారు బిగ్ బాస్ అని సంజన ఎమోషనల్ అవుతుంది. హౌస్ నుండి లగేజ్ తో బయటకు వచ్చేస్తుంది.
సంజన వెళ్లిపోవడంతో ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. కానీ కంటెస్టెంట్స్ అందరిలో టాప్-3 గా ఉన్న సంజన ఎలిమినేట్ అవ్వడమనేది జరగదు. అందుకే ఎలిమినేషన్ అని చెప్పి సీక్రెట్ రూమ్ లో పెడతాడు బిగ్ బాస్. లేదంటే ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే హైలైట్ గా నిలుస్తుంది. ఆదివారం రోజు ఆ విషయం నాగార్జున రీవీల్ చేసే ఛాన్స్ ఉంది. మరి మీకేనపిస్తుందో కామెంట్ చేయండి.
![]() |
![]() |